లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

 

గత మూడు రోజులుగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 29,422కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 9,136కు చేరింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో గ్రాసిమ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, గెయిల్‌, ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, అదానీపోర్ట్స్‌ షేర్లు లాభపడగా.. ఎస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటాపవర్‌ షేర్లు నష్టపోయాయి.