పడిపోయిన స్టాక్ మార్కెట్లు.. 30వేల దిగువకు సెన్సెక్స్‌

 

రెండు రోజుల క్రితం స్టాక్ మార్కెట్లు తొలిసారిగా 30వేల మార్క్‌ను దాటి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మాత్రం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ 30వేల బెంచ్‌మార్క్‌ దిగువకు పడిపోగా.. నిఫ్టీ కూడా స్వల్పంగా నష్టపోయింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 111 పాయింట్లు కోల్పోయి 29,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 9,304 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఓఎన్‌జీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందాల్కో, మారుతి సుజుకీ ఇండియా షేర్లు లాభపడగా.. ఐటీసీ, భారత ఇ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌మహింద్రా, అంబుజా సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.