డీలా పడ్డ స్టాక్ మార్కెట్లు...

 

నిన్న రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు ఈరోజు డీలాపడ్డాయి. ఈరోజు ఆరంభం నుండే నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ముగింపు కూడా నష్టాల్లోనే ముగిసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 104 పాయింట్లు నష్టపోయి 30,030 వద్ద స్థిరపడింది. మరోవైపు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ నిఫ్టీ మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. నేడు స్వల్పంగా 8 పాయింట్లు కోల్పోయి 9,342 వద్ద ముసిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బ్యాంక్‌, ఏసీసీ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, అంబుజా సిమెంట్‌ షేర్లు లాభపడగా.. అరబిందో ఫార్మా, లుపిన్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.