రైల్లో సీటు కోసం ఏకంగా గంగూలీతోనే గొడవ..!

అనుకోకుండా సెలబ్రిటీలు మనకు కనిపిస్తే ఏం చేస్తాం..కుదిరితే ఆటోగ్రాఫ్..ఇంకాస్త ముందుకెళితే ఒక సెల్ఫీ తీసుకుంటాం..అలాంటిది వాళ్లతో గొడవ పడితే. కానీ అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు భారత మాజీ కెప్టెన్, కోట్లాది మందికి ఆరాధ్య దైవం సౌరవ్ గంగూలీ. తన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రైల్లో బయల్దేరిన గంగూలీ తనకు కేటాయించిన ఏసీ ఫస్ట్‌ క్లాస్ సీటు వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే అందులో ఒక ప్రయాణికుడు కూర్చొని ఉన్నాడు. ఈ విషయాన్ని అతనితో చెప్పి అక్కడ కూర్చొనే యత్నం చేశాడు. అయితే అది తన సీటని, ఎట్టి పరిస్థితుల్లో లేచేది లేదని అతను తెగేసి చెప్పాడు..దీంతో రైల్వే సిబ్బంది గంగూలీకి ఏసీ టూ టైర్‌లో గంగూలీకి బెర్త్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత బలూర్‌ఘూట్‌లో ఏర్పాటు చేసిన తన ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని గంగూలీ ఆవిష్కరించాడు. తాను 2001 తర్వాత రైల్లో ప్రయాణించానని తిరిగి ఇంతకాలం తర్వాత ట్రైన్ జర్నీ చేయడం కొత్తగా ఉందన్నారు.