రాహుల్ గాంధీపై షీలా దీక్షిత్... రాహుల్ ఎక్కడెక్కడో గడిపితే సరిపోదు..

 

రాహుల్ గాంధీ పైన ప్రతిపక్ష పార్టీలు కామెంట్లు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమధ్య కాలంలో సొంత పార్టీ నేతలే రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ విమర్శలు గుప్పించిన సంగంతి తెలిసిందే. ఇందుకు గాను అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరో సీనియర్ మహిళా నేత కూడా రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాహుల్ తీరుపై మాట్లాడుతూ... రాహుల్ గాంధీ ఎక్కడెక్కడో గడిపితే సరిపోదని... పార్టీ కార్యాలయంలో అందరికీ అనునిత్యం కొన్ని గంటలైనా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. అంతేకాదు.. 19 ఏళ్ల క్రితం సోనియాగాంధీ పార్టీ పగ్గాలను చేపట్టినప్పుడు ప్రతి రోజు ఉదయం కనీసం రెండు మూడు గంటలు పార్టీ కార్యాలయంలో గడిపేవారని... ఇప్పుడు రాహుల్ కూడా ఇదే చేయాలని ఆమె అన్నారు.