సమైఖ్యాంద్ర ఇంటి దొంగలు

Publish Date:Sep 28, 2013

Advertisement

 

 

.... సాయి లక్ష్మీ మద్దాల

 

ఆంధ్రరాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ అధిష్టానానికి కోరి తెచ్చుకున్న కొరివిగ తయారయింది. ఆంద్ర ప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజనపై ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి కోరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో విభజన తీర్మానాన్ని గెలిపించుకోవటానికి కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తు గడలను జాగ్రత్తగా గమనించవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ తీర్మానం నెగ్గటం అసంభవం.


ఎందుకంటె సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక. ఈ ఎత్తుగడలలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానంతో వై.ఎస్.ఆర్.సి.పి కుమ్మక్కు అయి తన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదింప చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు బట్టబయలు ఐన కారణంగా వై.ఎస్.ఆర్.సి.పి వ్యూహం మార్చి శాసనసభలో సమైఖ్యాంద్ర తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాలని ప్రకటించటం మొదలుపెట్టింది. ఈ తీర్మానం వలన కూడా తొందరగా విభజన చేపట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది ఉంటె జె.ఎ.సి ద్వారా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను రికార్డు చేసి ప్రధానికి,రాష్ట్రపతికి పంపించవచ్చు.
                 వై.ఎస్.ఆర్.సి.పి రాజీనామా ఎత్తుగడలు విఫలం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం తన సొంత ఎమ్మెల్యేలని సమైఖ్యాంద్ర  కు అనుకూలంగా రాజీనామా చేయించి తద్వారా విభజన తీర్మానాన్ని గెలవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే బొత్స సత్యనారాయణ లాంటి తనకు అనుకూలురైన కొంతమంది ఎమ్మెల్యేలు,మంత్రులు చేత రాజీనామా చేయించి తద్వారా సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించి తెలంగాణ తీర్మానాన్ని గెలవాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఎత్తుగడగా కనిపిస్తోంది. రాజకీయనేతలు తమ పదవులను అడ్డం పెట్టుకుని ఎన్ని అవినీతులకు,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రజలు సహించారు,భరించారు,చూస్తూ ఊరుకున్నారు. కాని నేడు  ప్రజలు తమ జీవితాలు,తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే మాత్రం సహించబోరని నేడు జరుగుతున్న ఉద్యమాల ద్వారా బొత్సకు,జగన్ కు బోధ పడటక పోవటం విచారకరం.                  సమైఖ్యాంద్ర నినాదాన్ని భుజాన ఎత్తుకుంటూనే సమైఖ్యాన్ద్రకు ద్రోహం చేస్తున్న నేతల పట్ల సీమాంధ్రులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కై సమైఖ్యాంద్ర కు ద్రోహం చేస్తే సీమాంద్రలో సంఘ బహిష్కారానికి గురికాక తప్పదు.