సంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎంగా మాణిక్ సర్కార్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో రికార్డు సృష్టించారు. దేశంలోని అత్యంత సంపన్న సీఎంగా ఆయన రికార్డులకెక్కారు.. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్‌ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం.. మొత్తం రూ.177 కోట్ల ఆస్తులతో బాబు అగ్రస్థానంలో నిలిచారు.. ఆయన తర్వాత రూ. 129 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ద్వితీయ స్థానంలో నిలిచారు.. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ మూడో స్థానంలోనూ.. రూ. 15 కోట్ల ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలోనూ నిలిచారు. ఇక అత్యంత పేద ముఖ్యమంత్రిగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ మొదటి స్థానంలో ఉండగా.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.. సర్కార్ ఆస్తుల విలువ 26,83,195 మాత్రమేనట.