రాహుల్ ని పప్పు అన్నాడు... బుక్కయ్యాడు..
posted on Jun 13, 2017 2:59PM
.jpg)
రాహుల్ గాంధీపై ప్రతిపక్షపార్టీ నేతలు విమర్శలు, కామెంట్లు చేయడం కామన్. కానీ ఈ మధ్య సొంత పార్టీ నేతలే రాహుల్ పై కామెంట్లు చేయడం చూస్తున్నాం. ఇప్పుడు అలా నోరుజారి ఇరకాటంలో పడ్డాడు ఓ నేత. యూపీలోని మీరట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వాట్సాప్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో రాహుల్ గాంధీని జనాదరణ కలిగిన నేతగా, రైతు నేతగా, యువనేతగా అభివర్ణించాడు. అయితే రాహుల్ పేరుతో పాటు పప్పూ అని కూడా జతకావడం వివాదాస్పదమైంది. ఇక అంతే ఆ పోస్ట్ చూసిన వెంటనే కొంతమంది కాంగ్రెస్ నేతలు వాట్సాప్ గ్రూపులోనే వినయ్ పై మండిపడ్డారు. ఇక ఆ తరువాత విషయం గమనించిన వినయ్ ఆ పోస్టు తాను పెట్టలేదని, బిజ్ నౌర్ కు చెందిన అనురాగ్ చేసిందని చెప్పారు. కానీ వినయ్ పై మాత్రం విమర్సలు ఆగలేదు.