నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-38

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ-38 శాటిలైట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సరిగ్గా ఉదయం 9.29 గంటలకు లాంచ్ వెహికల్ నుంచి విడిపోయింది. ఇస్రో పీఎస్ఎల్వీ ఎక్స్‌ఎల్ మిషన్‌తో చేస్తున్న 17వ ప్రయోగం ఇది. ఇస్రో ఛైర్మన్ కిరణ్‌కుమార్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మనదేశానికి చెందిన కార్డోశాట్-2ఇ, తమిళనాడులోని నూరుల్ యూనివర్శిటీ విద్యార్థులు రూపకల్పన చేసిన ఉపగ్రహం, 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ38 నింగిలోకి మోసుకువెళ్లింది.