మోడీ నాకంటే పెద్ద యాక్టర్...నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా...?

 

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను ఇటీవల కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు స్పందించిన ప్రకాశ్ రాజ్ ...గౌరీ లంకేష్ హత్య పై మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు.. వరుసగా జర్నలిస్టులను హతమారుస్తుంటే ప్రధాని హోదాలో నోరు మెదపక పోవడం విచిత్రంగా ఉందని... తన కంటే మోడీ ఉత్తమ నటుడని.. అందుకే ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలన్నారు. ప్రధాని తీరుకు నిరసనగా జాతీయ ఉత్తమ నటుడుగా తనకు ఇచ్చిన అవార్డును వెనక్కు ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించారు ప్రకాష్ రాజ్.

 

అయితే ఇప్పుడు తాను వ్యాఖ్యలపై స్పందించి వివరించారు ప్రకాశ్ రాజ్.. `నేను మాట్లాడిన విష‌యాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అవార్డులు తిరిగి ఇచ్చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌లు చాలా హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. నేను క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి గెల్చుకున్న అవార్డుల‌ను తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాను. అవి నాకు గ‌ర్వ‌కార‌ణం` అని ఓ వీడియో ద్వారా ట్వీట్టర్లో తెలిపారు.