మోడీతో కరచాలనం.. చేతులు దులుపుకున్న సత్యనాదెళ్ల..
posted on Sep 30, 2015 3:13PM
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో పలు సంస్థల అథిపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కూడా కలిశారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉంది అయితే ఈ సందర్భంగా ఒక అంశంపై ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే మోడీని సత్యనాదేళ్ల కలిసిన నేపథ్యంలో అప్పుడు మోడీతో కరచాలనం చేసిన సత్యనాదెళ్ల తన రెండు చేతుల్ని దులిపేసుకుంటూ పక్కకు వెళ్లినట్టు వచ్చిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరూ సత్యనాదెళ్ల ప్రధానిని అవమానించారని అనుకుంటుండగా.. కొంతమంది అది కావాలని చేసింది కాదు.. అలవాటు పూర్వకంగా చేసి ఉంటారని అనుకుంటున్నారు.
దీనితో పాటు మోడీ ఫేస్ బుక్ అధినేత జుకెర్ బర్గ్ ను కలవడంపై కూడా వివాదాలు తలెత్తుతున్నాయి. మోడీ, జుకెర్ బర్గ్ ను కలిసిన నేపథ్యంలో గుజరాత్ లో సంభవించిన అల్లర్లకు కారణమైన మోడీతో చేయి కలిపిన జుకెర్ బర్గ్ చేతులకు రక్తపు మరకలు అంటుకున్నాయని.. ఆరక్తపు మరకలు కడుక్కునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జుకెర్ బర్గ్ కు 250 బాటిల్స్ పంపించారట.