దేశంలోనే పొడవైన బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ..

 

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా మోడీ దేశంలోనే అతి పెద్ద పొడవైన వంతెనను ప్రారంభించారు. 2011 వ సంవత్సరంలో  950 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ధోలా సదియా వంతెన పొడవు 9.2 కిలోమీటర్ల. గువహటికి 540 కిలోమీటర్లు దూరం..అరుణాచల్ ప్రదేశ్ కు 300 కిలోమీటర్లు దూరంతో అరుణాచల్, అస్సాం ప్రజలకు ఈ బ్రిడ్జి రోడ్డు మార్గంగా మారనుంది. అంతేకాదు ఈ వంతెన ద్వారా దాదాపు ప్రయాణ దూరం 4 గంటలు తగ్గుతుందని చెబుతున్నారు. ఇంకా యుద్ద ట్యాంకులు, ఆర్మి సామాగ్రి సులభంగా చేర్చే వీలు కూడా ఉంటుందని తెలుపుతున్నారు.