జేపీ కొత్త కమిటీ... పవన్ తో వేస్ట్

 

అసలు ఎవరు నిజం చెబుతున్నారు...ఎవరు అబద్దం చెబుతున్నారు అంటూ వారి నిజాలు బయటకి తీస్తా.. నిజాల నిగ్గు తేలుస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఏపీకి మేము ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామని.. అంటే.. టీడీపీ మాత్రం ఇవ్వలేదని చెబుతూ... జనాల్ని అయోమయంలో పడేస్తున్నారంటూ.. ఇద్దరిలో ఎవరు  నిజం చెబుతున్నారో.. ఎవరు అబద్దం చెబుతున్నారో నిజాలు బయటపెడతానంటూ లోక్ సత్తా అధినేత జేపీ, ఉండవల్లి ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలతో కలిసి జేఎఫ్ సీ అని ఓ కమిటీ ఏర్పాటు చేశాడు. ఇక ఆతరువాత అందరూ కలిసి ఏదో ఒక వారం రోజులు కష్టపడి మరో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని నిజాలు బయటపెట్టారు. ఏపీకి కేంద్రం ఇచ్చింది ఏం లేదని..దాదాపు 75 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెబుతూ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు. ఇక ఆతరువాత ఆ కమిటీ అడ్రస్సే లేదు. తొలుత కాస్తంత హడావిడి చేసిన పవన్ ఇప్పుడు అసలు దాని విషయమే మరిచిపోయారు. ఆ తరువాత ఎవరి దారి వారిది అన్నట్టు అయిపోయింది.

 

అందుకే జేపీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేఎఫ్సీ తరహాలోనే ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ప్రకటించేశారు. దీనిలో భాగంగానే జేపీ ఓ ప్రకటన కూడా చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జరుగుతుందని కూడా జేపీ ఆ ప్రకటనలో ప్రకటించేశారు. ఈ కమిటీలో కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు. అయితే జేపీ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటబ్బా అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు... అసలు ఉన్నట్టుండి జేఎఫ్ సీ లో సభ్యుడిగా ఉన్న జేపీ ప్రత్యేకంగా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారబ్బా అని అందరూ ఆలోచిస్తుండగా... ఓ ఆసక్తికర విషయం బయటపడింది. అసలు పవన్ కు తాను ఏర్పాటు చేసిన కమిటీపైనే నమ్మకం లేదన్న భావన ఉన్నట్లుగా జేపీ గ్రహంచారట. అంతేకాకుండా రాజకీయంగా ఎప్పటిప్పుడు కన్ఫూజన్ మైండెడ్తో ముందుకు సాగుతున్నారని ఈ క్రమంలో జేఎఫ్ సీతో పని కాదని ఓ అంచనాకు వచ్చిన తర్వాతే జేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జేపీకి కూడా పవన్ కన్ఫ్యూజన్ మైండ్ గురించి అర్ధమైనట్టు ఉంది. అందుకే ఈయనతో పెట్టుకుంటే వర్కవుట్ కాదని చెప్పి బయటకు వచ్చేసినట్టు ఉన్నారు. మరి జేపీ ఈ కమిటీ ద్వారా ఏం నిజాలు బయటపెడతారో చూద్దాం...