ఈయనెవరండి బాబు... స్ట్రాటజీ ఏంటో అర్దమయిచావట్లేదు...

 

ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు నిర్విర్తించడమంటే మామూలు విషయం కాదు...ఎన్నో వ్యూహాలు రచించాలి..ఎప్పటికప్పుడు పార్టీ గురించి అధ్యయం చేస్తుండాలి... సర్వేలు నిర్వహిస్తుండాలి.. ఇలా పార్టీ భారాన్ని మొత్తం మోయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పార్టీ గెలిచిందా ఓకే.. లేదంటే ఆ నష్టాన్ని కూడా తన భుజాలపై మోయాల్సిందే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరికోసం అంటారా... ఇంకెవరూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురించి.

 

భారత రాజకీయ నాయకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా ఈయన ఎంతో మందికి అధికారాన్ని అందించాడు. ప్రధాని మోడీ కూడా పీకే సలహాలు తీసుకున్నారంటేనే చెప్పొచ్చు.. ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో. ఇక ఇప్పుడు ప్రస్తుతం పీకే జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. జగన్ కూడా పీకే సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగిపోతున్నారు. అయితే అలాంటి పీకే కి ఇప్పుడు ఓ వ్యక్తి స్ట్రాటజీ ఏంటో అస్సలు అర్ధం కావట్లేదటా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 

తనకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని... కేవలం ప్రజా సమస్యలే తనకి ముఖ్యమని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రలు ప్రజా సమస్యలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా. దీనికి తోడు ఇన్నిరోజులు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండూ ఒకటే అనుకుంటే ఇప్పుడు  అది కూడా లేదన్న విషయం అర్ధమైపోయింది. సందు దొరికినప్పుడల్లా టీడీపీపై విమర్సలు చేస్తూనే ఉన్నారు. అటు వైసీపీ కి ఫెవర్ గా మాట్లాడతారా అంటే అదీ లేదు. దీంతో పవన్ 2019 ఎన్నికల వ్యూహం ఎంటో అర్ధకావట్లేదట. ఇంకా పార్టీ నిర్మాణం దశలోనే ఉంది.. అలాంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు ఏంటి.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అర్ధం కావట్లేదట. ఈ విషయాన్నే ఆయన సీనియర్ పార్టీ నేతలతో చర్చించారట. మొత్తానికి ఎన్నికల వ్యూహాలు రచించడంలో తల పండిన పీకే కే పవన్ గురించి అర్దం కావట్లేదంటే గ్రేటే. దీన్నిబట్టి చూస్తే పవన్ కాస్త డిఫరెంట్ అన్న విషయం మరోసారి రుజువైంది.