తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం వారికి అలవాటే.. పల్లె
posted on Jun 29, 2015 3:16PM
ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత కేసీఆర్ కే లేదు.. అలాంటిది రాజకీయాల్లో ఓనమాలు కూడా సరిగా రాని కేటీఆర్ విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని.. కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని ఏపీ మంత్రి పల్లె రాఘునాథరెడ్డి మండిపడ్డారు. అలాగే తెలంగాణ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెడ్డడం తెలంగాణ మంత్రులకు అలవాటే అని, టీడీపీ భిక్షతో మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అలాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. చట్టం గురించి శ్రీహరికి తెలియక పోయినా ఏపీ మంత్రులకు చట్టం గురించిన అవగాహన లేదని అనడం శ్రీహరి అహంకారానికి నిదర్శమని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్ని సెక్షన్లు, షెడ్యూళ్లు, పేజీలు ఉన్నాయో శ్రీహరికి తెలుసా? అలాంటిది సెక్షన్-8 చట్టబద్ధం కాదని అని అంటున్నారని విమర్శించారు.