నిలబడి పాట పాడలేదని.. గర్భవతి సింగర్ కాల్చివేత..

 

నిలబడి పాట పాడలేదని ఓ మహిళను తుపాకీతో కాల్చారు. అది కూడా ఓ గర్భిణి మహిళను. ఈ దారుణమైన ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.... పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా.. ఈ కార్యక్రమంలో పాటలు పాడేందుకు గాను ప్రముఖ గాయని సమీనా సామూన్ ను ఆహ్వానించారు. గర్భవతి అయినప్పటికీ ఆమె పాటలు పాడేందుకు అంగీకరించి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆమె గర్భవతి కావడంతో నిలబడి పాటలు పాడటం కష్టం కాబట్టి కూర్చొనో పాటలు పాడింది. ఇంతలో తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి నిలబడి పాట పాడాలని ఆమెను ఆదేశించాడు. దానిని ఆమె పట్టించుకోలేదు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తారిఖ్ అహ్మద్ ఆమెను తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె భర్త, తన భార్యతో పాటు, ఆమె కడుపులో వున్న తన బిడ్డను కూడా కడుపున బెట్టుకున్న తారిఖ్ అహ్మద్ పై జంట హత్యల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్య వీడియో క్లిప్ ను పాక్ లో మానవహక్కుల సంఘం ప్రతినిధి కపిల్ దేవ్ ట్విట్టర్‌ లో పోస్టు చేయడంతో వైరల్ అయిందే.