పద్మ పురస్కారాల ప్రదానం

 

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీచేతుల వీుదగా పలువురు రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాలను అందుకున్నారు. మొత్తం తొమ్మిది మందికి పద్మవిభూషణ్, ఇరవై మందికి పద్మ భూషణ్, డెబ్భై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన డా. మంజుల, క్రీడారంగంలో మిథాలి రాజ్, పివీ సింధు, సినిమా రంగంలో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. కాగా మదన్ మోహన్ మాలవ్య కు మరణానంతరం భారతరత్నను ఆయన కుటుంబ సభ్యులకు అందజేసిన విషయం తెలిసిందే.