ఒబామా చివరి ప్రసంగం..

 

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఈరోజు తన ఆఖరి ప్రసంగంలో పాల్గొన్నారు. త‌న స్వంత ప‌ట్ట‌ణం చికాగో వేదిక‌గా జరిగిన ఈ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ... విశ్వాసం అంటే ఏంటో చికాగోలో నేర్చుకున్నాను అని అన్నారు. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం... ప్రజల వల్లే అమెరికా శక్తివంతమైన దేశంగా మారిందని.. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే, అన్ని రంగాల్లోనూ, అమెరికా ఉత్త‌మ‌మైన‌, ప‌టిష్ట‌మైన స్థానంలో ఉంద‌న్నారు. ఇవాళ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజు.. ప్రతిరోజు ప్రజల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని..ప్రజల మద్దతు వల్లే మంచి అధ్యక్షుడినికాగలిగానని భావోద్వేగంగా మాట్లాడారు. మూడు అంశాల వ‌ల్ల అమెరికా ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఆర్థిక అస‌మాన‌త్వం, జాతి వివ‌క్ష‌, వివిధ వ‌ర్గాల బెదిరింపులు దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఆటంకంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు. మరో పది రోజుల్లో అధికార మార్పిడి జరగనుందని చెప్పారు. కాగా ఈనెల 20న అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న సంగతి తెలిసిందే.