కొత్త 500 నోట్లు విడుదల...

 

దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకుగాను ప్రధాని మోడీ రూ.500, రూ 1000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వాటికి బదులు కొత్త 500 నోట్లు, రెండు వేల నోట్లు ముద్రించి అందరికి అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మరిన్ని  సెక్యూరిటీ ఫీచర్స్  జోడించి కొత్త 500 నోట్లు విడుదల చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్త నోటులో  'ఏ' అనే అక్షరాన్ని జోడించామని..ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో పాటు, వెనక వైపు 2017 అని ముద్రించిన కొత్త  రూ. 500 కరెన్సీ నోటును విడుదల చేసినట్టు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. అలాగే ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500  నోట్లకు  చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, అశోక్‌ స్థంభం కుడివైపున బ్లీడ్‌ లైన్స్‌ ఇతర  గుర్తులతోపాటు, అంధులు గుర్తించేలా ఇంటగ్లియో ముద్రణను కూడా జత చేసింది.