విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్

తమపై ఎన్డీఏ ప్రయోగించిన అస్త్రాన్నే ప్రతిపక్షాలు ఎన్టీఏపై ప్రయోగించాయి. ఎన్టీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో తమ అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న దానిపై విపక్షాలు గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో విపక్షాలు సమావేశమై రాష్ట్రపతి ఎన్నికపై చర్చించాయి. తమ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌‌ను ప్రతిపాదించాయి. మీరాకుమార్ భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె..ఈమె ఐదుసార్లు ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా సేవలందించారు. ఈ నెల 27న లేదా 28న ఆమె నామినేషన్ వేయనున్నారు.