మోడీని రాష్ట్రపతి చేసిన ఒబామా
posted on Sep 29, 2015 3:28PM
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రపతిని చేశారు. ఎప్పుడు ఎలా అనుకుంటున్నారా. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతం పలికారు. అయితే ఆయన మోడీకి స్వాగతం పలికే క్రమంలో ‘వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. వెంటనే పక్కన ఉన్న అధికారులు ఇది గమనించి తప్పును సరిచేశారు. అయితే భేటీ సందర్భంగా మళ్లీ మోడీ ప్రెసిడెంట్ అనే సంబోధించడం జరిగింది.. ‘ప్రెసిడెంట్ మోడీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది' అని ఒబామా చెప్పారు.. అయితే ఈ వీడియోను వైట్‌హౌస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయగా అప్పుడు ఆవ్యాఖ్యలు విన్న సిబ్బంది నాలుక కరుచుకొని అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.