రాష్ట్రాల నిధుల్ని గుజరాత్‌కి తరలిస్తున్న మోడీ

ఉత్తరాది పెద్దలు దక్షిణాదిని చిన్న చూపు చూడడం అనాదిగా వస్తున్న వ్యవహారం. నిధుల కేటాయింపుల దగ్గరి నుండి, మంత్రుల్ని నియమించడం, కొత్త ప్రాజెక్ట్ లకు ఆర్ధిక సహాయం వంటి విషయాల్లో ఎప్పుడు మొండి చేయి ఇస్తూ వస్తుంది. అసలు దక్షిణాది రాష్ట్రాలు అంటే పరాయి దేశంలా వ్యవహరిస్తుంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాట ఇచ్చి, దాటిన మోడీ ప్రభుత్వం మరో తప్పు చేసి పార్లమెంట్ సాక్షిగా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ప్రతిసారి రాష్ట్రాలకి 45 శాతం నిధులు కేటాయిస్తున్నామని చెప్పే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఏయే రాష్ట్రాలకు ఎంత కేటాయించారో లెక్కలు చెప్పారు. దాంతో పది శాతం కోత పెడుతున్న విషయం బహిర్గతమైంది.

ఇంతకీ, ఇలా కోత పెడుతున్న డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు? ఈ మిగులు నిధులన్నీ మోడీ సొంత రాష్ట్రమయిన గుజరాత్ కి తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రతి సారి, గుజరాత్ కి వరాలు అందిస్తూ గుజరాత్ కి మాత్రమే ప్రధాన మంత్రి గా వ్యవహరిస్తున్న మోడీ, ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలని విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే, మోడీ ప్రభుత్వం ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒంటెద్దు పోకడలా వ్యవహరిస్తున్న మోడీ, చరిత్ర హీనుడిగా మిగిలి పోవాల్సి వస్తుంది.