టీడీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం..

 

నంద్యాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే ఉప ఎన్నికలో గెలుపొందేందుకు గాను వైసీపీ, టీడీపీ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండు పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో వార్త కలకలం రేపుతోంది. నంద్యాలలో టీడీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. అయితే నలుగురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేత బుడ్డా శేషారెడ్డి కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో శేషారెడ్డి వాహనం అటువైపు వస్తుండటంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో, వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది.