నన్నెందుకు ప్రత్యేక హోదా అడుగుతారు.. వెంకయ్యనాయుడు
posted on May 25, 2015 12:08PM
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై చాలా ఘాటుగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను కాదన్నారని, అందుకే కర్నాటక నుండి రాజ్యసభకు వెళ్లానని అన్నారు. అలాంటప్పుడు తెలుగు ప్రజలు తనను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి నన్ను అడగడం సబబు కాదని, నేను ఒక్క ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే మంత్రిని కాదని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మంత్రినని అన్నారు. అసలు ఏపీకీ లోటు బడ్టెట్ అనే ఒకే ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని.. అంతకుమించి ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ లేవని స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న లోటు బడ్జెట్‌ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భూసేకణ చేపట్టడం చాలా అభినందనీయమని, ఏపీ ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని వెల్లడించారు.