చంద్రబాబు మోడీల భేటీ.. ఓ కన్నేసిన టీ సర్కార్
posted on Aug 25, 2015 12:42PM
ఈరోజు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా? ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తుందా ఇలా చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందని ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర నేతలు ప్రజలు ఎంతలా చూస్తున్నారో మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా అంతలా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ.. చంద్రబాబు భేటీల పై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఏపీకి ఇచ్చేహామీలను బట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లాలని.. అంతేకాదు రాష్ట్ర విభజనపుడు ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావాలని టీ సర్కార్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేంద్ర ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమో కాని ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఏపీకి భారీగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందో చూసి దానిని బట్టి తెలంగాణకు ప్యాకేజీ కోసం ప్రభుత్వాన్ని కోరుతామంటున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలనైనా అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగానే టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి రాష్ట్రం లో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణనే అని.. తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైందని అన్నారు. అందుకేసమే పోరాడి ప్రత్యేక రాష్ట్రం కోసం సాధించామని.. తెలంగాణ ప్రాంతంలో ఏడు జిల్లాలు వెనుబడి ఉన్నాయని.. ఏపీకి ఎలాగైతే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారో అలాగే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.