పోతేపోండి.. మాకు వైసీపీ ఉంది...!

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఇచ్చేంత వరకూ పోరాటం ఆగేది లేదని... అవసరమైతే తమతో తెగదెంపులు చేసుకుంటామని టీడీపీ చెబుతుంది. అయితే మొదట ఈ విషయంలో కాస్త వెనుకడుగు వేసిన ఇప్పుడు మాత్రం కాస్త భిన్నంగానే వ్యవహరిస్తుంది. ఆందోళనలు ఎంత ఉదృతం చేసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అస్సలు చూసినట్టుగానే వ్యవహిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు రాజీనామానలు చేసిన ఏం లై తీసుకున్నారు. రాష్ట్రపతికి పంపించారు. ఇక ఆయన కూడా ఆమోదించారు. అయితే అసలు బీజేపీ ఇలా వ్యవహరించడానికి కారణం ఏంటబ్బా అని అందరూ అనుకుంటుండగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

 

కావాలనే బీజేపీ అలా వ్యవహరిస్తుందోని... టీడీపీతో కటీఫ్ కే చూస్తుందోని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ. టీడీపీ పోతే పోయింది.. వైసీపీ ఉందిలే అని అనుకుంటున్నారట. అంతేకాదు.... నిధులు, గుజరాత్ కి, మహారాష్ట్రకి ఇచ్చుకుంటాం.. మీకివ్వం.. అలాగని విడిపోతారా.. విడిపోండి.. మాకు వైసీపీ మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉంది.. మాతో చేతులు కలపాలని చూస్తుంది.. టీడీపీని వదిలేయమని.. మనిద్దరం కలిసి పనిచేద్దామని ఎప్పటినుండో రాయబారాలు పంపుతోంది అని ఓ బీజేపీ కీలక వ్యాఖ్యానించినట్టు రాజకీయ వర్గాల టాక్. దానికి తోడు..  వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మాకు కనుక ఎక్కువ సీట్లు వస్తే ఎన్నికల అనంతరం బీజేపీకి వద్దతిచ్చి ప్రత్యేక  హోదా సాధిస్తామని చెప్పుకొస్తున్నారు. అంటే రెండు పార్టీలు పొత్తుకు సిద్దంగా ఉన్నాము.... మీరు పోతే పోండి అని చెప్పకనే చెబుతుంది. ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

 

అంతేకాదు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జగన్ పై పెట్టిన కేసుల్లో క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు, సీబీఐ చర్యల నిలుపుదల, జగన్ రాజకీయంగా ఎదిగేందుకు సహకరించడం వంటి ప్రయోజనాలను ఎన్డీయే సర్కారు అందిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన 34.6 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల జప్తు విషయంలో ఈడీ అపిలేట్ అథారిటీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ అంటే తన మీద ఉన్న కేసుల నేపథ్యంలో బీజీపీతో పొత్తు సిద్దమయ్యాడు. మరి బీజేపీ వైసీపీలో ఏం చూసి పొత్తుకు రెడీ అయ్యిందో. అంటే తమ చెప్పు చేతల్లో ఉంటారని మోడీ చాలా దూరం ఆలోచించి ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు ఉన్నారు. అలా చేయాలంటే అసలు వైసీపీ అధికారంలోకి రావాలి కదా. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ పరిస్థితి ఏపీలో ఏంటో తెలిసు.. అలాంటి వైసీపీ ని పక్కన పెట్టుకొని మోడీ గారు ఏం చేద్దామనో.. పాపం మోడీ ఇలానే మూర్ఖత్వంతో వ్యవహరిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.