రోజాను భయపెడుతుంది ఎవరో తెలుసా...?

 

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అంటుంటారు. అంతేకాదు ఆమె నోటికి కూడా చాలా భయపడుతుంటారు. అలాంటిది ఇప్పుడు రోజానే ఓ వ్యక్తికి భయపడుతున్నారట. రోజాని అంతలా భయపెట్టిన వ్యక్తి ఎవరు..? రోజా అంతలా భయపడుతున్న ఆ వ్యక్తి ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు...  టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్. గత ఎన్నికల్లోనే వైసీపీ నుండి పోటీ చేసిన రోజా పెద్ద మెజార్టీతో ఏం గెలవలేదు. గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై పోటి చేసిన రోజా...ఏదో చావుత‌ప్పి కన్నులొట్ట‌బోయిన‌ట్టు కేవ‌లం 800 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో గెలిచింది. ఇక గెలిచి ఈ మూడేళ్లలో ఆమె నియోజక వర్గానికి చేసింది ఏదైనా ఉందీ అంటే.. చెప్పుకోవడానికి ఏం లేదు. నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేదు… పోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అయినా అందుబాటులో ఉంటున్నారా ? అంటే అదీ లేదు.

 

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న గాలి వార‌సుడు గాలి భానుప్ర‌కాష్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ్రామాన్ని చుట్టి వ‌స్తున్నారు. ఇంటింటికి టీడీపీని ఒంటి చేత్తో స‌క్సెస్ చేసిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిగా గ్రిప్ సాధించారు. ఇటు తండ్రి నుంచి వ‌చ్చిన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని, ఆ ప‌రిచ‌యాల‌ను వాడుకుని న‌గ‌రిలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గాలికి వ‌య‌స్సు పైబ‌డ‌డంతో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ కూడా భాను ప్ర‌కాష్‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో వారి సహకారంతో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో త‌న వ్యూతో భానుప్ర‌కాష్ ముందుకు వెళుతున్నారు. తండ్రి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయ‌న వ‌య‌స్సు దృష్ట్యా కుమారుడే వ్య‌వ‌హారాల‌ను న‌డిపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌తో పాటు భానుప్ర‌కాష్ ఆలోచ‌న‌లు చూసిన విప‌క్ష వైసీపీ నాయ‌కులు కంటిన్యూగా టీడీపీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇక భానుప్ర‌కాష్ దూకుడు చూసిన రోజా ఇప్పుడు భయపడుతుందట. అంతేకాదు.. చివ‌ర‌కు న‌గ‌రిలో సొంత ఇళ్లు క‌ట్టుకుని ఎన్నిక‌ల‌కు ఇక్క‌డే మ‌కాం వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారట. ఇంకా విచిత్రం ఏంటంటే భాను ప్ర‌కాష్ ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లి వ‌చ్చారో ? మ‌రుస‌టి రోజు రోజా అక్క‌డ వాలిపోతున్నార‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. మొత్తానికి తన నోటితో అందరినీ భయపెడుతున్న రోజానే.. ఇప్పుడు ఆమెనే భయపడుతుందటే... గ్రేటే..