అడవి పళ్ళు తిని 14 మంది మృతి

 

అడవిలో కనిపించిన పళ్ళు తిన్న 14 మంది మరణించారు. మేఘాలయలోని తూర్పు జైనతేయ పర్వతాల్లో వున్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అస్సాంలోని దుబ్రి జిల్లాకి చెందిన కొంతమంది కూలీలు రహదారి పనుల నిమిత్తం మేఘాలయకు వచ్చారు. అడవుల్లో రహదారి పనులు జరుగుతున్న సమయంలో అక్కడ ఆకర్షణీయంగా కనిపించిన పళ్లను కోసుకుని తిన్నారు. విషపూరితమైన ఆ పళ్ళను తిన్నవెంటనే 14 మంది కూలీలు మరణించారు.