మావోయిస్ట్ అయితే అరెస్ట్ చేస్తారా.. కేరళ కోర్టు
posted on May 23, 2015 3:59PM
కేరళ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలా వాళ్లు షాకయ్యే తీర్పు ఏమిచ్చిందో చూద్దాం. శ్యామ్ బాలకృష్ణ అనే వ్యక్తిని కేరళ పోలీసులు నక్సల్ పేరుతో అరెస్ట్ చేశారు. బాలకృష్ణను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. శనివారం ఈ పిటిషన్ పై జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ విచారణ జరిపారు. నేరం చేశాడని ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం మావోయిస్ట్ అనే ఒకే ఒక్క కారణంతో బాలకృష్ణను అరెస్ట్ చేశారని నమ్ముతున్నానని అన్నారు. అయినా మావోయిస్ట్ అయినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? ఎక్కడైనా భౌతిక దాడులకు పాల్పడ్డారా, ఆస్తులు ధ్వంసం చేశారా లేక హింసాత్మక చర్యలకు దిగారా అని ప్రశ్నించారు. మావోయిస్ట్ అని పేరున్నంత మాత్రన అరెస్ట్ చేయడం సబబు కాదని తీర్పు నిచ్చారు. బాలకృష్ణను అరెస్ట్ చేసి అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని, అతనికి నష్ట పరిహారం కింద రూ. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పుతో కేరళ పోలీసులు నిర్ఘాంతపోయారు.