మధురలో ఘోరం... ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి..

 

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. వివరాల ప్రకారం...  ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బరేలీకి చెందిన మహేష్ శర్మ కుటుంబం... తమ కుమార్తె మానసి 75 శాతం మార్కులు సాధించడంతో మొక్కులు సమర్పించుకునేందుకు రాజస్థాన్‌  దౌసాలోని మెహందీపూర్ బాలాజీ ఆలయ దర్శనానికి కారులో బయలుదేరారు. అయితే సరిగ్గా ఐదు గంటల ప్రయాణం తర్వాత డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న మధుర కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.