లైవ్ షో జరుగుతుంటే..

 

ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి విచిత్రమైన ఘటనే చోటుచేసుకుంది రష్యాలో. అసలు సంగతేంటంటే.. రష్యాలోని ఓ న్యూస్‌ ఛానల్‌లో మాస్కో డిమాలిషన్‌ గురించి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అయితే వ్యాఖ్యత మాట్లాడుతుండగా.. ఆమె డెస్క్‌ కింద ఏదో కదులుతున్నట్లు కన్పించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన యాంకర్‌ అక్కడికి వచ్చిన శునకాన్ని చూసి అవాక్కయ్యింది. అయినా వార్తలు చదవడం ఆపలేదు. అయితే ఆ శునకం మాత్రం వెళ్లిపోకుండా టేబుల్‌ మీదకు ఎక్కి పేపర్లు తీసేందుకు ప్రయత్నించింది. దాదాపు 15 సెకన్ల పాటు శునకం లైవ్‌లో కన్పించింది. కానీ యాంకర్‌ మాత్రం వార్తలు చదువుతూనే ఉంది. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.