లోక్ సభ స్పీకర్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫైర్!!

 

కులాలు, మతాలు పక్కనపెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని నీతులు చెప్పాల్సిన నాయకులే.. కులాలు, మతాలు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సాక్షాత్తూ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం ప్ర‌కాశ్ బిర్లాయే కుల వ్య‌వ‌స్థ‌ను ప్రోత్సాహించేలా మాట్లాడ‌టం వివాదాస్పదమైంది.

 


 
ఇటీవ‌ల అఖిల బ్రాహ్మ‌ణ మ‌హాస‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఓం బిర్లా బ్రాహ్మ‌ణ కులానికి అనుకూలంగా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. "స‌మాజంలో బ్రాహ్మ‌ణుల‌కు ఉన్న‌త‌స్థానం ఉంది. ఇది పరుశురాముడుని త్యాగం, త‌ప్ప‌స్సు కార‌ణంగా ప్రాప్తించింది. ఈ కార‌ణంతో ఎప్పుడూ బ్రాహ్మ‌ణులు స‌మాజంలో మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించే కీల‌క భూమిక‌ను పోషిస్తున్నారు" అన్నారు.
 
ఓ బాధ్యాత‌మ‌యుత‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు ఎలా చేస్తారు? అని నెటిజ‌న్లు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. ఈ క్రమంలో వారికి మ‌ద్ద‌తుగా టాలీవుడ్‌ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి కూడా ట్విట్ట‌ర్ వేదికగా ఓం బిర్లాను విమర్శించారు. "నేను బ్రాహ్మ‌ణ కులానికి చెందిన వ్య‌క్తిని. అయితే కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు మాత్రం మేం గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో? అర్థం కావ‌డం లేదు. నువ్వు చేసే ప‌నులను బట్టే నువ్వు గొప్ప‌వాడివి అవుతావు. కానీ నీ కులం వ‌ల్ల కాదు" అంటూ లావ‌ణ్య ట్వీట్ చేశారు.