కుల్‌భూషణ్‌కు మరణశిక్ష తప్పదా..?

గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను విడిపించడానికి భారత్ రంగంలోకి దిగింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో సైతం ఉరిశిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ పాక్ ససేమిరా అనడంతో జాదవ్ పాక్ మిలటరీ కోర్టులో క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఇవాళ దీనిని విచారించిన న్యాయస్థానం క్షమాభిక్ష పిటిషన్‌ను తీరస్కరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. కాగా, జాదవ్‌కు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆయన తల్లి చేసిన విజ్ఞప్తిని పాక్ అధికారులు పరిశీలిస్తున్నారు.