కొత్త పార్టీ పెట్టమని అడుగుతున్నారు...


తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ ఛైర్మన్  ప్రొ.కోదండ‌రామ్ కీలక పాత్ర పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ అధికా పార్టీ అయిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు మద్య విబేధాలు తలెత్తాయన్నసంగతి కూడా విదితమే. దీనిలో భాగంగానే అప్పట్లో కోదండరామ్ కొత్తపార్టీ పెడతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తరువాత ఎలాంటి వార్తలు రాకపోయినా... తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో  ప‌ర్య‌టిస్తున్న కోదండరామ్... కొంద‌రు త‌న‌ను రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని కోరుతున్నారని, పార్టీ పెట్టాల‌ని త‌న‌పై ఒత్తిడి ఉందని కీల‌క వ్యాఖ్య చేశారు. ఈ అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ నెల 30న హైద‌రాబాద్‌లో 'కొలువులకై కొట్లాట' సభ నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు.