చండీయాగం... నీ డబ్బుతో చేసుకో...
posted on Oct 29, 2015 2:46PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తన చండీయాగాన్ని సొంత డబ్బుతో చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు, సొంత మొక్కులకు ప్రభుత్వ డబ్బును ఖర్చుచేస్తే ఊరుకునేది లేదన్న సురవరం... ప్రజాధనంతో చండీయాగం చేయొద్దని కేసీఆర్ కి సూచించారు, గతంలోనూ ప్రభుత్వ డబ్బుతో వివిధ దేవాలయాలకు మొక్కుకున్న మొక్కలు తీర్చుకున్నారని, ఈసారి మాత్రం అలాచేస్తే అంగీకరించబోమని అన్నారు, మత విశ్వాసాలు అనేవి వ్యక్తిగతమైనవన్న సురవరం సుధాకర్ రెడ్డి... వాటిని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం సరికాదన్నారు. గతంలోనూ ప్రభుత్వ డబ్బుతో కేసీఆర్ మొక్కులు చెల్లించడంపై విమర్శలు చెలరేగాయి, మరి చండీయాగం సొంత ఖర్చులతో నిర్వహిస్తారో... లేక ప్రతిపక్షాల విమర్శలను లెక్కచేయకుండా ప్రభుత్వ డబ్బుతో చేస్తారో చూడాలి?