కేసీఆర్‌వి ఉడత ఊపులు... భట్టి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌వి ఉడత ఊపులని, ఆ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీని బెదిరించాలని, భయపెట్టాని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన విజయం సాధించరని భట్టి అన్నారు. మర ఫిరంగులకు కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయపడరని, అలాంటిది కేసీఆర్ ఉడత ఊపులకు భయపడరని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని, ఈ కుటుంబ పాలనను అంతం చేస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ హామీల మీద హామీలు ఇస్తున్నారుగానీ, ఒక్క హామీ అమలుకైనా నిధులు కేటాయించిన పాపాన పోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. 2019 సంవత్సరం ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.