కర్ణన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ...
posted on May 15, 2017 3:21PM

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే జైలు శిక్ష పడింది. అయితే తనపై జారీచేసిన అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కర్ణన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. అయితే ఇప్పుడు తాను ఈ కేసులో తాను బేషరుతుగా క్షమాపణ చెబుతానని జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, కేసులో విచారణను వేగవంతం చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ ఆదేశాలను వెనక్కి తీసుకునేది లేదని.. ‘విలువైన కోర్టు సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. మీ పిటిషన్ వరుస క్రమంలో వచ్చినప్పుడు విచారణ చేస్తాం కదా’ అంటూ చీవాట్లు పెట్టింది.
ఇదిలా ఉండగా జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించగా.. అప్పటినుండి జస్టిస్ కర్ణన్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఆయన ఆచూకీ కోసం తమిళనాడు, బంగాల్ రాష్ట్రాల పోలీసులు విస్త్రత గాలింపు చేపట్టారు.