విమానం ఎక్కనివ్వడం లేదని జేసీకి స్పెషల్ ఫ్లైట్..

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో దురుసుగా వ్యవహరించి విమాన ప్రయాణంపై నిషేదానికి గురయ్యారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అప్పటి నుంచి ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు స్పైస్ జెట్‌లో ప్రయాణించే ప్రయత్నంలో ఆయన్ను విమానం దించివేశారు..అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం తన నిషేదం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జేసీకి సూచించారు.