జగన్ ని జనసేన సంప్రదించలేదట..!

 

ఏపీ లో ఎన్నికల సమయానికి, ఏ పార్టీ ఒంటరిగా వెళ్తుందో? ఏ పార్టీ జంటగా వెళ్తుందో? అంటూ ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి.. ఇప్పటికే వైసీపీ, జనసేన పొత్తు అంటూ ఆరోపణలు వచ్చాయి.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్ కు మద్దతిస్తారని అన్నారు.. దీంతో పొత్తు ఉండొచ్చనే అంతా అనుకున్నారు.. అయితే ఈ విషయం గురించి మాట్లాడిన జగన్ కాస్త భిన్నంగా స్పందించినట్టు తెలుస్తుంది..

'ఇప్పటివరకు పొత్తు గురించి నన్నెవరూ సంప్రదించలేదు.. మేం ఏ పార్టీ మద్దతులేకుండానే గెలుస్తామనే నమ్మకం నాకుంది.. గత ఎన్నికల్లో బీజేపీ,జనసేన పార్టీలు టీడీపీకి మద్దతిచ్చాయి.. అయినా మాకంటే 1.5 శాతం ఓట్లే ఎక్కువ సాధించింది.. ఇప్పుడు అవి ఒంటరిగా పోటీచేస్తే టీడీపీకి ఓటమి తప్పదు' అని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి జగన్ ఊహించినట్టు వైసీపీ గెలుస్తుందో లేదో.