మచిలీపట్నం పోర్టు తెలంగాణాకి రాసిచ్చేశారా జగన్ ?

 

అదేదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఒకటుంది " పొలం పుట్ర లో పొలం నాకు..పుట్ర నీకు..వాగువంక లో వాగు నాకు..వంక నీకు..కొంపాగోడు లో కొంప నాకు..గోడు నీకు..పంచేసుకోని హ్యాపీ గా ఉందాం.." అలా ఉంది ఏపీ సీఎం జగన్ వ్యవరించే తీరు. నిజానికి ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అవగానే తెలంగాణాలో ఉన్న ఏపీ భవనాలు ఏవీ తనకు అక్కర్లేదని మీరే తీసేసుకోండని చెప్పి వచ్చారు. ఆయన అడిగాడో లేక ఈయనే అడిగాడో తెలీదు కానీ, మొత్తానికి తెలంగాణాకి లాభం చేకూర్చే వాటికీ చాలా సందర్భాల్లో వత్తాసు పలుకుతూ వచ్చారు. 

ఇందులో అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏపీకి పనికి వచ్చేది లేదు. తాజాగా కేసీఆర్, జగన్ హైదరాబాద్లో భేటి ఆయన విషయం తెలిసిందే, ఈ సమావేశం సుమారు అరు గంటల పాటు జరిగింది. ఇదే భేటిలో మచిలీపట్నం పోర్టు అంశం గురుంచి చర్చకు వచ్చినట్లు ఆ పోర్ట్ తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ జగన్ ని కోరగా దానికి జగన్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మూడు రోజుల నాడు తెలంగాణకు మచిలీపట్నం పోర్ట్ కేటాయిస్తూ రహస్య జివో RT-62 28/06/2019 రిలీజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ రహస్య జివోలో మచిలీపట్నం పోర్ట్ పూర్తి హక్కులు, సుమారు 8000 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణకి చెందేటట్లు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. 

దాదపుగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ప్రబుత్వం ఈ విషయం మీద స్పందించలేదు. పోర్టులు, భవనాలు, నీళ్లు కేసీఆర్‌కు ధారాదత్తం చేస్తారా..? ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నేతలకి ప్రభుత్వం అసలు తమకి ఏమీ వినపడడం లేదనట్టు ప్రవర్తించడం పలు అనుమానాలకి తావిస్తోంది. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లో నెంబర్ ప్రకారం కాన్ఫిడెన్షియల్ జీవో అంటూ ఒక జీవో కనిపిస్తున్నది.  అయితే ఈ జీవో నిజంగా పోర్టును తెలంగాణాకి ధారాదత్తం చేశాడా ? ఓకవేళ నిజంగా చేసినట్ట్టయితే ఏదో ఒక రోజు బయటకు రావలసిన విషయమే అది. అయితే అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో ఒక చిన్ని చెంబు కూడా వదులుకోని సమాజం మనది, అలాంటిది అన్న వాటాకి సంబందించిన ఎయిర్ కూలర్ లాంటి వస్తువును అన్నకే తెలీకుండా తమ్ముడు తీసుకుంటే అది తెలీకుండా ఉంటుందా ? చూడాలి ఈ కాన్ఫిడెన్షియల్ జీవో ఎన్నాళ్ళు కాన్ఫిడెన్షియల్ గానే ఉంచుతారో ?