భారత్, పాకిస్థాన్ యుద్దం.. ఇందిరా గాంధీ బెడ్‌కవర్లను మార్చుతూ కూర్చున్నారు..
posted on Apr 29, 2016 3:26PM
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గురించి ఆమె దగ్గర పనిచేసిన వైద్యుడు కేపీ మాథుర్.. ఇందిరా గాంధీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 92 ఏళ్ల కేపీ మాథుర్ ఇందిరాకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసేవారు. అయితే ఆయన రాసిన "ద అన్‌సీన్ ఇందిరా గాంధీ" పుస్తకంలో ఇందిరా గాంధీ గురించి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్యర్చపోవాల్సిందే. ముఖ్యంగా భారత-పాక్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇందిరా గాంధీ ఏం చేశారో ఆయన తెలిపారు. 1971 నవంబర్ 5వ తేదీన 'భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన మరుసటి రోజు అంటే నవంబర్ 6వ తేదీన నేను వెళ్లేసరికి ఇందిరా గాంధీ స్వయంగా బెడ్‌కవర్లను మార్చుతూ కనిపించారు.బహుశా ఈ పని ద్వారా ముందురోజు అర్థరాత్రి వరకు ఉన్న పని ఒత్తిడి నుంచి ఆమె బయటపడి ఉంటారు' అని తన పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు ఇంకా ఆమె గురించి తెలుపుతూ.. ప్రధాని అయిన మొదట్లో ఇందిరా చాలా ఒత్తిడికి గురయ్యేవారు.. శని, ఆదివారాల్లో ఏ మాత్రం వీలుదొరికినా.. పుస్తకాలు చదివేవారన్నారు. మధ్యాహ్న భోజనం ముగిశాక కొన్నిసార్లు పేకాట ఆడేవారని రాశారు.