మ‌రో 8 ఏళ్ల‌లో అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశం ఏంటో తెలుసా ?

 

భారత దేశ జ‌నాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. మ‌రో 8 ఏళ్ల‌లో జ‌నాభా విష‌యంలో భార‌త్ చైనాను దాటేయనుంది అని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది. 2027 క‌ల్లా ప్ర‌పంచంలోనే అత్యధిక జ‌నాభా ఉన్న దేశంగా భార‌త్ నిలుస్తుంద‌ని త‌న రిపోర్ట్‌లో పేర్కొంది.

భార‌త్‌లో 2050 వ‌ర‌కు మ‌రో 273 మిలియ‌న్ల జ‌నాభా జ‌త‌కూడ‌నున్న‌ట్లు అంచ‌నా వేశారు. యూఎన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ సోష‌ల్ అఫైర్స్‌కు చెందిన పాపులేష‌న్ డివిజ‌న్ ఈ రిపోర్ట్‌ను ఇచ్చింది. అయితే మ‌రో 30 ఏళ్ల‌లో ప్ర‌పంచ జ‌నాభా సుమారు 200 కోట్లు పెర‌గ‌నున్న‌ట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాబా 770 కోట్లుగా ఉంది. అయితే ఇది 2050 వ‌ర‌కు సుమారు 970 కోట్లు కానున్న‌ది. ఈ శ‌తాబ్ధం చివ‌రిలోగా ప్ర‌పంచ జ‌నాభా మ‌రీ తారాస్థాయికి చేరనున్న‌ది. అది సుమారు 11 బిలియ‌న్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే 2050 వ‌ర‌కు కేవ‌లం 9 దేశాల్లో జ‌నాభా పెరుగుద‌ల ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ది. ఆ లిస్టులో ఇండియా లీడింగ్‌లో ఉంటుంది. ఆ త‌ర్వాత నైజీరియా, పాకిస్థాన్‌, కాంగో, ఇథోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికా దేశాలు ఉన్నాయి అని రిపోర్ట్‌ పేర్కొంది.