జైలులో ఇళవరసి ఆవేదన.. నేనేం తప్పు చేశా.. శవంగానే బైటకు వస్తా..
posted on May 25, 2017 1:12PM

అక్రమాస్తుల కేసులో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రస్తుతం బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్ష విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జైలులో ఉన్న శశికళ ను పరామర్శించడానికి నేతలు వెళుతున్న సంగతి కూడా విదితమే. అయితే మొదట అందరిని కలవడానికి ఆసక్తి చూపించినా... ఆతరువాత మాత్రం ఆమె కొంతమందినే కలిసేవారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అయితే శశికళతో పాటు అదే జైలులో ఇళవరసి కూడా ఉంటున్నారు. కానీ ఇళవరసి మాత్రం జైలులో ఉన్నందుకు బాగా కుమిలిపోతున్నట్టు సమాచారం. ఆమెను చూసేందుకు కుమారుడు వివేక్, ఇతర బంధువులు వచ్చినపుడల్లా కన్నీరుమున్నీరవుతున్నారట. అసలు నేనేం తప్పు చేశాను, ఇంట్లో ఉంటూ అందరికీ వండి పెట్టాను, అడిగిన చోటల్లా సంతకం పెట్టిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని ఆమె వెక్కివెక్కి రోదిస్తున్నారట. నేనేం తప్పు చేశానని జైల్లో రోజూ నరకం అనుభవిస్తున్నాను, జైలు నుంచి శవంగానే బైటకు వస్తానని ఆవేదన చెందుతున్నారట.