ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..పడిపోయిన టీం ఇండియా ర్యాంక్..!
posted on May 4, 2016 6:40PM
ఈరోజు ఐసీసీ టి20, వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. ప్రతీ ఏడాదీ ఐసీసీ రిలీజ్ చేసే ఈ లిస్ట్ లో, ఈ ఏడాది భారత్ కు టి20లో సెకండ్ ప్లేస్, వన్డేల్లో నాలుగో ప్లేస్ దక్కింది. ఇప్పటికే ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.
టి 20:
132 పాయింట్లతో న్యూజీలాండ్ తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్(3), దక్షిణాఫ్రికా(4), ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా(6) ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. ఆప్ఘానిస్థాన్ బంగ్లాదేశ్ ను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానం దక్కించుకోవడం విశేషం.
వన్డే ర్యాంకింగ్స్:
ఎప్పటిలాగే వన్డేల్లో తొలిస్థానం ప్రపంచకప్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియానే వరించింది. 124 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్థానాన్ని దక్కించుకుంది. న్యూజీలాండ్(2), దక్షిణాఫ్రికా(3), భారత్(4), శ్రీలంక(5) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. న్యూజీలాండ్ 113 పాయింట్లు, దక్షిణాఫ్రికా 112 పాయింట్లు, భారత్ 109 పాయింట్లతో ఆయా స్థానాల్లో నిలిచాయి.
టెస్ట్ ర్యాంకింగ్స్:
టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా భారత్ రెండో ప్లేస్ లో నిలిచింది. పాకిస్తాన్(3), ఇంగ్లండ్(4), న్యూజీలాండ్(5) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరో స్థానానికి పడిపోవడం విచిత్రం. 2014-15 మధ్యలో సౌతాఫ్రికాకు పరాజయాలు ఎక్కువశాతం ఉండటమే ఇందుక్కారణం.