హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎదురవుతున్న అవాంతరాలు...

 

హుజూర్ నగర్ పోలింగ్ జరుగుతోంది. మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ పద్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, బిజెపి నుంచి రామారావు, టిడిపి నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం మూడు వేల మూడు వందల యాభై మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 53 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు సమాచారం. కానీ అధికారికంగా పోలింగ్ శాతం రావాల్సి ఉంది. అయితే తొలి గంటలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ప్రధానంగా నేరేడుచర్ల మండల కేంద్రంలోని చింతబండ లోని ముప్పై ఒకటి, ముప్పై మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించడంతోటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల బయటనే వేచి చూసిన పరిస్థితి ఉంది. అయితే టెక్నికల్ సిబ్బందిని పిలిపించి ఈవిఎంలను నడిపించే  పరిస్థితిలో అధికారులు ఉన్నారు. 

మఠంపల్లి మండలంలో ఒక చోట మాత్రం వెలుతురు సరిగా లేని కారణంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చింతలపాలెం మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ లోని నూట అరవై ఎనిమిదిలో సరైన వెలుతురు లేక గుర్తులు సరిగా కనిపించటం లేదని చెప్పి ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో దానిని సరిదిద్దే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ గుర్తు ఎక్కడ ఉందనేది చీకటి ఉన్న నేపథ్యంలో మాత్రం సరిగా కనిపించటం లేదని చెప్పే అక్కడ ఒక ఓటర్ ఆరోపణ చేశారు.దానిని సరిచేసే ప్రయత్నాలలో అధికారులు ఉన్నారు.