'ఆమ్ ఆద్మీ' ఏం చేస్తాడు..?

 

 

 

ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాజ్ జంగ్ పిలుపు మేరకు హర్షవర్దన్ గురువారం సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు.తగిన బలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదన్న పార్టీ వైఖరిని హర్షవర్ధన్ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం.


మరోవైపు రెండో అతిపెద్ద పార్టీ అయిన ఆమ్ ఆద్మీకి గవర్నర్ ఆహ్వానం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం వచ్చిందని ఏఏపీ అధికార ప్రతినిధి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. అయితే ఏఏపీ మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవ్వరి మద్దతూ తీసుకోకూడదన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు.


ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ని కలవనున్న ఆమ్ ఆద్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడొనన్న ఆసక్తి ఢిల్లీ ప్రజల్లో నెలకొంది.