జేఎఫ్‌సీ‌ కోసం ఇద్దరు ఏపీ అధికారులు

విభజన హామీలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేస్తోన్న వాదనల్లో ఎవరి వాదన సరైనదో తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జే‌ఎఫ్‌సీ అనే కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు, మేధావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీకి సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ అధికారులను నియమించింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న కమిటీకి సహకరించడంతో పాటు లెక్కలను వివరించేందుకు గానూ.. ప్రేమ్ చంద్రారెడ్డి, బాలసుబ్రమణ్యంలను ఏపీ ప్రభుత్వం పంపించింది. లెక్కలను జనసేన పార్టీకి కాకుండా త్రిసభ్య కమిటీకి సమర్పించాల్సిందిగా పవన్ అధికారులకు సూచించారు.