హీరోయిన్ ఛార్మి పెళ్ళి

 

హీరోయిన్ ఛార్మి ఈమధ్య జనాలకి ట్విట్టర్ ద్వారా షాకులిస్తోంది. మూడు రోజుల క్రితం ‘ఓ ఎస్ అయాం ఇన్ లవ్’ అని ట్విట్ చేసింది. దాంతో టాలీవుడ్ జనంతోపాటు మామూలు జనం కూడా ఛార్మి మనసు దోచుకున్న మగానుభావుడెవరబ్బా అని బుర్రలు పగిలిపోయేలా ఆలోచించారు. అయితే సమాధానం మాత్రం దొరకలేదు. ఛార్మి లవ్వులో పడ్డానని చెప్పిందిగానీ, ఎవరితో పడిందో మాత్రం చెప్పలేదు. జనం ఇంకా ఆమె లవ్వుకి సంబంధించిన సందేహాల్లో మునిగి తేలుతూ వుండగానే ఛార్మి మంగళవారం నాడు మరో షాకింగ్ ట్విట్ చేసింది. ‘‘ఈరోజు నేను పెళ్ళి చేసుకుంటున్నాను’’ అని పోస్టు పెట్టింది. ఈ వాక్యం పక్కనే ఒక లవ్ సింబల్ కూడా పెట్టింది. అయితే కొంతమంది సినీ మేధావులు మాత్రం ఈ ట్విట్లను లైట్‌గా తీసుకోవాలని అంటున్నారు. ఛార్మి ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా హీరోతో లవ్‌లో పడిపోయిన సందర్భంలో అలా నేను ప్రేమలో పడ్డానని ట్విట్ చేసి వుంటుందని, మంగళవారం నాడు ఏదో పెళ్ళి సీన్లో యాక్ట్ చేసి ‘ఈరోజు నేను పెళ్ళి చేసుకుంటున్నాను’ అని ట్విట్ చేసి వుంటుందని చెబుతున్నారు. ఇలా చిలిపి పనులు చేయడం ఛార్మికి బాగా అలవాటని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో ఛార్మి క్లారిటీ ఇచ్చేవరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే వుంటుంది.