ఫేస్‌బుక్ సిక్స్ ప్యాక్

 

ఫేస్‌బుక్ సంస్థ ‘సిక్స్ ప్యాక్’ పేరుతో కొత్త హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ ‘సిక్స్ ప్యాక్’ ద్వారా ఫేస్‌‌బుక్ యాప్స్, ఫేస్‌‌బుక్ సేవలు మరింత మెరుగ్గా వినియోగదారులకు అందనున్నాయి. ఇది ఒక స్విచ్‌లా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న పరికరం. దీని ద్వారా ఫేస్‌‌బుక్ భారీ నెట్‌వర్క్‌లను కూడా నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. నెట్‌వర్కింగ్ పరికరాలను తయారు చేయడంలో ఇప్పటి వరకూ సిస్కో కంపెనీ ఆధిపత్యం హార్డ్ వేర్ రంగంలో కొనసాగుతోంది. ఆ సంస్థ కంటే ధీటుగా ఫేస్‌బుక్ సొంతగా ఈ ‘సిక్స్ ప్యాక్’ను తయారు చేసుకోవడం విశేషం. జూన్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ చిన్న పరికరం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హై కెపాసిటీ స్పైస్ స్విచ్‌ల కంటే బాగా పనిచేస్తుందని ఫేస్‌‌బుక్ వర్గాలు చెబుతున్నాయి.