దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు.. నిందితులకు మరణశిక్ష..


దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లే కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉండగా.. వారికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. అసదుల్లా, రెహ్మాన్, అక్తర్, యాసిఫ్ భత్కల్, సయ్యద్ లకు మరణశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

 

కాగా 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది దుర్మరణం పాలవ్వగా.. 138 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ... దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఇదిలాఉండగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు హైకోర్టునుసమాచారం. ఇప్పటికే నిందితుల తరపు న్యాయవాది సంబంధిత డాక్యుమెంట్లపై ఐదుగురు నిందితుల నుంచి సంతకాలు తీసుకొని వెళ్లినట్టు తెలుస్తోంది.